ఆ నాలుగు సిటీల్లో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు!   - night curfew in four gujarat major cities extended
close
Published : 15/02/2021 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ నాలుగు సిటీల్లో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు! 

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడి కోసం గుజరాత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూని ఫిబ్రవరి 28 వరకు కొనసాగించాలని  అధికారులు నిర్ణయించారు. అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌లలో రాత్రి 12 గంటల నుంచి  ఉదయం 6గంటల వరకు కొనసాగనుందని తెలిపారు. గతంలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఉన్న ఈ సమయాన్ని ఒక గంటపాటు తగ్గించారు. ఈ నెల 16 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ తెలిపారు. నవంబర్‌లో దీపావళి తర్వాత కేసులు పెరగడంతో ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూని విధించింది.

మరోవైపు, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు 7.91లక్షల మంది తొలి డోసు వేయించుకున్నట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లో ఆదివారం కొత్తగా 247 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,65,244కి పెరిగింది. వీరిలో 2,59,104మంది కోలుకోగా.. 4401 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1739 క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని