అన్నవరంలో నిహారిక దంపతులు - niharika and chaitanya visit annavaram temple
close
Published : 13/12/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నవరంలో నిహారిక దంపతులు

అన్నవరం: ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక తన భర్త చైతన్యతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలో పాల్గొన్న వీరికి పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు. నిహారిక అత్తమామలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

డిసెంబరు 9న చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోగల ఉదయ్‌ విలాస్‌లో వివాహ వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. కొణిదెల-అల్లు కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేశారు.డిసెంబరు 11న హైదరాబాద్‌లో వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. గుంటూరు మాజీ ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగారు. భాగ్య నగరంలోని ఓ ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆగస్టులో నిహారిక-చైతన్యల నిశ్చితార్థం జరిగింది.

ఇవీ చదవండి..
ఘనంగా నిహారిక-చైతన్య కల్యాణం
కొణిదెల-అల్లు సకుటుంబ సపరివార సమేతంగా..!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని