Niharika: వరుణ్‌ తేజ్‌కు నిహారిక స్పెషల్‌ గిఫ్ట్‌ - niharika dedicates lovely song from bro to his lovely brother varuntej
close
Published : 20/08/2021 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Niharika: వరుణ్‌ తేజ్‌కు నిహారిక స్పెషల్‌ గిఫ్ట్‌

మా అన్నయ్యకు ఇది అంకితం

హైదరాబాద్‌: తన అన్న వరుణ్‌తేజ్‌కు నటి నిహారిక స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ‘అన్నయ్యా నువ్వు పిలిస్తే’ లిరికల్‌ పాటను తన ప్రియమైన అన్నకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. నటుడు నవీన్‌ చంద్రా, అవికా గోర్‌ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’. అన్నాచెల్లెళ్లు మధ్య ఉండే అనురాగం, ఆప్యాయతలు తెలియజేసే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘బ్రో’ నుంచి రాఖీ పండుగని పురస్కరించుకుని తాజాగా ఓ లిరికల్‌ పాట విడుదలైంది. ప్రముఖ గాయని సునీత ఈ పాటను ఆలపించారు. ‘ఈ రోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా’ అంటూ సాగే ఈ పాట ప్రతిఒక్కర్నీ ఆకట్టుకునేలా ఉంది. కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్‌చంద్రా స్వరాలు అందించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని