ఎన్నికల నియమావళిపై సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ - nimmagadda ramesh kumar letter to ap cs
close
Published : 10/01/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నికల నియమావళిపై సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వేగవంతం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రవర్తనా నియమావళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని లేఖలో పేర్కొన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రవర్తనా నియమావళి అమలులో ఉండదని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో సభలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లబ్ది చేకూర్చే పనులు చేపట్టవద్దని సూచించారు. ఇలాంటి చర్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శుక్రవారం రాత్రి ప్రకటించింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 

ఇవీ చదవండి...
ఎన్నికల సిబ్బందికి టీకా ఇవ్వండి: ఎస్‌ఈసీ

టోల్‌గేట్ల వద్ద ‘సంక్రాంతి’ రద్దీ
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని