close

తాజా వార్తలు

Published : 27/11/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అల్లు అర్జున్‌కి తొమ్మిది మంది విలన్లా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాకి  విలన్‌ దొరకడం అంత సులభమా... ప్రెజెంట్‌ డైరెక్టర్స్‌ని ఈ మాట అడిగితే కష్టమే అంటారు. హీరోయిన్‌ కోసం ఎంతగా వెతుకుతున్నారో, విలన్‌ కోసమూ అంతే వెతుకుతున్నారు. అలాంటి ఈ రోజుల్లో ఓ సినిమాలో తొమ్మిది మంది విలన్లు అంటే నమ్ముతారా? టాలీవుడ్‌లో నడుస్తున్న చర్చ చూస్తే నమ్మకతప్పదు అనిపిస్తోంది. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న ‘పుష్ప’ గురించే ఈ చర్చ. ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు మొత్తంగా తొమ్మిది మంది విలన్లట. 

‘పుష్ప’లో హీరో తెలుసు, హీరోయిన్‌ తెలుసు... విలన్‌ సంగతే తెలియదు. ఈ పాత్ర కోసం బాబీ సింహా, విజయ్‌ సేతుపతి... ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో పేరు కూడా వినిపిస్తోంది. అంతే కాదు విలన్ల సంఖ్య మీద కూడా కొత్త మాట చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’రాజ్‌ను ఢీకొట్టడానికి టాలీవుడ్‌ కొత్త విలన్‌ను తీసుకుంటారని తెలుస్తోంది. ‘డిస్కోరాజా’, ‘కలర్‌ఫొటో’తో తనలోని విలనిజం చూపించిన సునీల్‌ ‘పుష్ప’కి విలన్‌ అవుతాడని అంటున్నారు. మరోవైపు ‘చియాన్‌’ విక్రమ్‌ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు.

విలన్‌ విషయం పక్కనపెట్టి.. విలన్ల సంగతి చూద్దాం. విలన్లు ఏంటి అనుకుంటున్నారా... ‘పుష్ప’లో తొమ్మిది మంది విలన్లు ఉంటారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ... టాలీవుడ్‌లో అయితే హాట్ టాపిక్‌గా మారింది. పాత కాలం సినిమాల్లోలాగా ‘పుష్ప’లో ఎక్కువమంది విలన్లను పెడుతున్నారట సుకుమార్‌. దీనికి సంబంధించి బేసిక్‌ వర్క్‌ కూడా పూర్తయిందట. ఈ మాట కూడా పుకారులా మిగిలిపోతుందా... లేక నిజమవుతుందా అనేది చూడాలి. బన్ని-సుకుమార్ కాంబో‌ కదా ఏదైనా సాధ్యమే మరి. అన్నట్లు ఇటీవల చిత్రీకరణ ప్రారంభించాక... సెట్‌లో బన్ని ఫొటోలు కొన్ని వైరల్‌ అయ్యాయి. మీరు కూడా చూసే ఉంటారు. 



Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని