‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..? - ninnu chudakunda video song from check nithiin
close
Updated : 23/02/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉరిశిక్ష పడ్డ ఓ ఖైదీ జైలు గోడల మధ్య ‘చెస్‌’లో తన ప్రతిభ చూపించి ఆ శిక్ష నుంచి ఎలా తప్పించుకున్నాడన్న కథాంశంతో వస్తున్న చిత్రం ‘చెక్‌’. నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రియాప్రకాశ్‌ వారియర్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్లు. భవ్యక్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మించారు. కల్యాణి మాలిక్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాల్లో ఒకే ఒక్క పాట ఉన్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ‘నిన్ను చూడకుండ ఉండలేకపోతున్నాను’ అంటూ సాగే ఆ వీడియో సాంగ్‌ ప్రోమోను తాజాగా విడుదల చేసింది. అందులో నితిన్‌తో కలిసి ప్రియ స్టెప్పులేసింది. శ్రీమణి రచించిన ఈ పాటను హరిచరణ్‌, శక్తిశ్రీ గోపాలన్‌ ఆలపించారు. కల్యాణి మాలిక్‌ బాణీలు కూర్చారు. ఆలస్యమెందుకు..! ఆ పాటను మీరూ చూడండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని