Nithiin: డిస్నీ+హాట్‌స్టార్‌లో నితిన్‌ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే! - nithiin maestro will streaming from september 17 on hotstar
close
Updated : 28/08/2021 21:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nithiin: డిస్నీ+హాట్‌స్టార్‌లో నితిన్‌ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌, నభా నటేశ్‌ జంటగా రూపొందిన చిత్రం ‘మ్యాస్ట్రో’. తమన్నా కీలక పాత్ర పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా స్ట్రీమింగ్‌ తేదీని చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబరు 13 నుంచి ‘మాస్ట్రో’ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ‘కళ్లు కనపడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరించింది. అంధుడిగా నితిన్‌ నటన మెప్పిస్తోంది. మహతి స్వర సాగర్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రం హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’ రీమేక్‌గా రూపొందింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని