Nithiin: ‘మ్యాస్ట్రో’.. గుమ్మ‌డికాయ కొట్టేశారు - nithiin new film maestro shoot completed nabha natesh tamannah played key roles
close
Published : 20/06/2021 14:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nithiin: ‘మ్యాస్ట్రో’.. గుమ్మ‌డికాయ కొట్టేశారు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: నితిన్ క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘మ్యాస్ట్రో’. న‌భా న‌టేశ్ క‌థానాయిక‌. త‌మ‌న్నా ముఖ్యపాత్ర‌లో క‌నిపించ‌నుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యిన‌ట్టు, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకొంటున్న‌ట్లు  చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో మొద‌లైన‌ తుది షెడ్యూల్‌లో నితిన్‌, త‌మ‌న్నాల‌పై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. సినిమాకే హైలైట్‌గా నిలిచే స‌న్నివేశాలివి. హిందీలో విజయం అందుకున్న ‘అందాధున్’ రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో న‌రేశ్‌, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధ‌న్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై ఎన్‌.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్, ఛాయాగ్ర‌హ‌ణం:  జె.యువ‌రాజ్‌, కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖ‌ర్‌, క‌ళ‌:  సాహి సురేశ్‌. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని