బాక్సాఫీస్‌ వార్‌కు ఈ హీరో సిద్ధం - nithiin new movies in 2021
close
Updated : 19/02/2021 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాక్సాఫీస్‌ వార్‌కు ఈ హీరో సిద్ధం

మూడు విభిన్నకథా చిత్రాలతో రానున్న నితిన్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు నితిన్‌.. బాక్సాఫీస్‌ వార్‌కు సిద్ధమయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు వరుసగా మూడు సినిమాలతో ఆయన ఈ ఏడాది వెండితెరపై సందడి చేయనున్నారు. గతేడాది విడుదలైన ‘భీష్మ’ తర్వాత మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లపై సంతకం చేసిన ఆయన.. శరవేగంగా వాటి చిత్రీకరణలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం విడుదలవుతోన్న నితిన్‌ సినిమాలేంటి? ఆయా చిత్రాల్లో ఆయనకు జోడీగా ఎవరు నటిస్తున్నారు? మీరూ ఓ లుక్కేయండి..!

‘చెక్‌’ పెట్టనున్నాడా?

కమర్షియల్‌ హంగులతో కూడిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘చెక్‌’. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. లవర్‌బాయ్‌లా కనిపించే ఆదిత్య అనే కుర్రాడు ఖైదీలా ఎందుకు మారాడు? అతనిపై ఉగ్రవాది అనే ముద్ర ఎందుకు పడింది? పరిస్థితులతో అతను ఎలా ‘చదరంగం’ ఆడాడు. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!


ప్రేమపాఠాలు చెప్పడానికి సిద్ధం

నితిన్‌-కీర్తిసురేష్‌ మొదటిసారి జంటగా కలిసి నటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం వేసవి కానుకగా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, పెళ్లి.. అనే వాటికి కొంచెం దూరంగా ఉండే అర్జున్‌ (నితిన్‌) అనే కుర్రాడు అను(కీర్తి)తో ఎలా ప్రేమలో పడ్డాడు? పెళ్లి తర్వాత వీరిద్దరి జీవితం ఎలా ఉండనుంది? అనే విషయాలను ఆసక్తికరంగా చూపించే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది.


అంధుడిగా మేజిక్‌ చేస్తాడా?

బాలీవుడ్‌లో హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘అంధాధున్‌’. ఆయుష్మాన్‌ఖురానా, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ రీమేక్‌లో నితిన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా చేయనున్నారు. అలాగే రాధికా ఆప్టే స్థానంలో నభానటేశ్‌ నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు  చిత్రబృందం ప్రకటించింది. తన మ్యూజిక్‌తో మేజిక్‌ చేసే యువకుడు ఓ మహిళ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఇంతకీ ఆ మహిళతో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని