హైదరాబాద్: స్నేహితులందరం కలిసి ఓ అందమైన సినిమా చేశాం అంటోంది నిత్యమేనన్. ఆమె అశోక్ సెల్వన్, రీతూవర్మతో కలిసి నటించిన చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. అని.ఐ.వి.శశి దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. జీ ప్లెక్స్‌లో ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిత్య మేనన్ మాట్లాడుతూ ‘‘మా అందరికీ ఎంతో నచ్చిన చిత్రమిది. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ‘అలా.. మొదలైంది’ గుర్తుకొస్తుంది. స్నేహితులైన నేను, నాని, నందిని కలిసి చేసిన సినిమా అది. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఇదీ అంతే మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంటుంది’’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘సినిమా చూస్తున్నంతసేపూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇంటిల్లిపాదికీ వినోదం పంచే ఓ మంచి చిత్రమిది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రాజేశ్ మురుగేశన్, ఛాయాగ్రాహకుడు దివాకర్ మణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’