ఫార్ములా రేసర్‌ శిక్షణలో హీరోయిన్‌ - nivetha pethuraj turns a certified car racer
close
Published : 13/07/2021 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫార్ములా రేసర్‌ శిక్షణలో హీరోయిన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: నటనతో పాటు ఇతర విషయాల్లోనూ ఆసక్తి చూపించే నటులు ఎంతో మంది ఉన్నారు. తమ అభిరుచికి అనుగుణంగా అప్పుడప్పుడూ ఇతర వ్యాపకాలపైనా దృష్టి పెడుతుంటారు. అలా ‘మెంటల్‌ మదిలో’, ‘చిత్రలహరి’, ‘అల వైకుంఠపురములో’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి నివేదా పేతురాజు ఇప్పుడు ఫార్ములా రేసర్‌ శిక్షణలో ఉంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. సర్టిఫైడ్‌ కార్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తోందట. దక్షిణాదిలో అజిత్‌, నాగచైతన్యలు ఇప్పటికే సర్టిఫైడ్‌ కార్‌ రేసర్లుగా గుర్తింపు పొందారు. మరి నివేదా తన కలను నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం విశ్వక్‌సేన్‌కు జోడీగా ‘పాగల్‌’ చిత్రంలో నటిస్తోంది నివేదా

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని