అత్యధిక భాషల్లో రీమేకైన ఏకైక చిత్రం! - nnn created history in remake
close
Published : 08/03/2021 19:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అత్యధిక భాషల్లో రీమేకైన ఏకైక చిత్రం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ సూపర్‌ హిట్‌ చిత్రం నాలుగైదు భాషల్లోకి రీమేక్‌ అవడం సహజం. అలాంటిది 9 భాషల్లో తెరకెక్కితే సంచలనం. అలా సహజంగా తెలుగు తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. సిద్ధార్థ్‌, త్రిష జంటగా ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రమిది.  సుమంత్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.ఎస్‌ రాజు నిర్మించిన ఈ సినిమా 2005 జనవరి 14న విడుదలై ఘన విజయం అందుకుంది. ధనిక అబ్బాయి, పేద అమ్మాయి మధ్య సాగే ప్రేమ కథ ప్రతి ఒక్కరిని హత్తుకుంది. భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు, నాయకానాయికల నటన, దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడే కాదు ఏ భాషలో రూపొందినా అక్కడి ప్రేక్షకులూ ఈ చిత్రాన్ని ఆదరించారు. ఆ స్పందనతోనే 7 భారతీయ భాషల్లోకి, 2 విదేశీ భాషల్లోకి రీమేకైన ఏకైక చిత్రంగా రికార్డు నెలకొల్పింది ఈ చిత్రం. ఏ భాషలో ఏ పేరుతో వచ్చిందో చూద్దాం...

1.  ఉనక్కం ఎనక్కం (తమిళం)

2. నీనెల్లో నానల్లే (కన్నడ)

3. ఐ లవ్‌ యు (బెంగాలీ)

4. నింగోల్‌ తజబ(మణిపురి)

5. సునా ఛాదీ మో రూపా ఛాదీ (ఒడియా)

6. తేరా మేరా కీ రిష్తా (పంజాబీ)

7. రామయ్య వస్తావయ్యా (హిందీ)

8.నిస్సా అమర్‌ తుమీ (బంగ్లాదేశ్‌ బెంగాలీ)

9.ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా (నేపాలీ)
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని