18 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌! - no corona deaths in eighteen states in india says centre
close
Published : 17/02/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

18 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌!

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రోజురోజుకు రికవరీల సంఖ్య కూడా పెరుగుతుండటం సానుకూల పరిణామంగా పేర్కొంది. 

‘గడిచిన 24 గంటల్లో దేశంలో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. ఇక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విషయానికొస్తే.. బుధవారం ఉదయం 8గంటల సమయం వరకు దేశవ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 90 లక్షల మార్కు అందుకుంది. వారిలో 61లక్షల మంది ఆరోగ్య సిబ్బంది తొలి డోసు పూర్తి చేసుకోగా.. రెండో డోసు పూర్తి చేసుకున్నారు 2.76లక్షల మంది ఉన్నారు. టీకా కారణంగా విషమ పరిస్థితులు తలెత్తిన కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదు’ అని ఆరోగ్య శాఖ వెల్లడించింది.  కాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.76లక్షల టీకాలు వేయగా.. అందులో 1.60లక్షలు తొలి డోసు వేయించుకున్న వారు కాగా.. 1.16లక్షల మంది రెండో డోసు వేయించుకున్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది . 

కాగా కేంద్ర ఆరోగ్యశాఖ ఫిబ్రవరి 13 నుంచి కొవిడ్‌ టీకా రెండో డోసు ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి డోసు తీసుకుని 28 రోజులు పూర్తి చేసుకున్న వ్యక్తులకు రెండో డోసు వేస్తున్నారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని