సింగపూర్‌ వేరియంట్‌ కాదు... అది B.1.617.2 - no its not singapore variant
close
Published : 19/05/2021 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సింగపూర్‌ వేరియంట్‌ కాదు... అది B.1.617.2

దిల్లీ: సింగపూర్‌లో కరోనా కొత్తరకం ప్రబలుతోందని, ఆ దేశం నుంచి విమాన సర్వీసులు రద్దు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను ఆ దేశం తీవ్రంగా ఖండించింది. అది సింగపూర్‌ వైరస్‌ రకం కాదని, భారత్‌లో కన్పించిన వేరియంటేనని వెల్లడించింది. ఈ మేరకు దిల్లీలోని సింగపూర్‌ హైకమిషన్‌ ట్విటర్‌ ద్వారా బదులిచ్చింది.

‘‘సింగపూర్‌లో కొవిడ్ కొత్త స్ట్రెయిన్ ఉందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఫిలోజెనెటిక్‌ పరీక్షల ద్వారా అది b.1.617.2 వేరియంట్‌ అని తేలింది. గత కొన్ని వారాలుగా సింగపూర్‌లో నమోదైన చాలా కేసులకు(పిల్లలతో సహా) ఈ స్ట్రెయినే కారణం’’ అని ఎంబసీ ట్వీట్‌ చేసింది. సింగపూర్‌లో ప్రబలుతున్న కొత్త రకం వైరస్‌ చిన్నారులకు ప్రమాదకరమని కేజ్రీవాల్ నిన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఆ దేశం నుంచి విమానసర్వీసులు నిలిపివేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అయితే దీనికి కేంద్ర విమానాయానశాఖ స్పందిస్తూ.. ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తెచ్చే విమానాలు మాత్రమే నడుస్తున్నాయని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా, భారత్‌లో కన్పించిన కొవిడ్‌ లక్షణాలు తమ దేశంలోనూ కన్పించడంతో బుధవారం నుంచి దేశంలోని బడులన్నీ మూసివేయాలని సింగపూర్‌ నిర్ణయించింది. సింగపూర్‌లో తాజాగా 38 కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఎక్కువ మంది పిల్లలే. అయితే ఎవరికీ పరిస్థితి విషమించలేదని తెలుస్తోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని