వాళ్లకు క్వారంటైన్‌ అవసరం లేదు - no need of quarentine for indvseng players who participate in ipl
close
Published : 21/03/2021 07:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లకు క్వారంటైన్‌ అవసరం లేదు

దిల్లీ: ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్‌ మధ్య సిరీస్‌లో ఆడుతున్న ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్‌లో ఆడాల్సిన వాళ్లున్నారు. అయితే ఒక బయో బబుల్‌ నుంచి మరో బయో బబుల్‌కు వెళ్తున్నందున వీళ్లు ఐపీఎల్‌కు ముందు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ మేరకు బీసీసీఐ శనివారం టోర్నీ నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన విధానాలను విడుదల చేసింది. ఐపీఎల్‌కు సంబంధించిన వాళ్లెవరికీ ప్రస్తుతానికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేయరని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పింది. ‘‘భారత్, ఇంగ్లాండ్‌ సిరీస్‌ కోసం సృష్టించిన బయో బబుల్‌లో నుంచి ఐపీఎల్‌లో చేరుతున్న ఆటగాళ్లు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండకుండా నేరుగా ఫ్రాంఛైజీలతో చేరవచ్చు. సిరీస్‌ ముగిసిన తర్వాత వారిని జట్టు బస్సు లేదా ప్రత్యేక విమానం ద్వారా నేరుగా హోటల్‌కు తరలిస్తాం. ప్రయాణ ఏర్పాట్లపై అక్కడి ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తే ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండకుండా, ఆర్టీపీసీఆర్‌ పరీక్ష లేకుండా తమ జట్లతో చేరవచ్చు’’ అని పేర్కొంది. 

వ్యాక్సిన్‌ కోసం..: ఐపీఎల్‌ నేపథ్యంలో తమ జట్టు ఆటగాళ్లు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇప్పించాలని బీసీసీఐని కోరినట్లు దిల్లీ క్యాపిటల్స్‌ చెప్పింది. ‘‘మేం బీసీసీఐతో మాట్లాడాం. ఆరోగ్య మంత్రిత్వ శాఖతో మాట్లాడుతున్నారు’’ అని దిల్లీ ఫ్రాంఛైజీ అధికారి చెప్పాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని