రైళ్ల రాకపోకలు నిలిపివేయట్లేదు! - no plan to stop or curtail train services no. will be increased on demand
close
Published : 09/04/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైళ్ల రాకపోకలు నిలిపివేయట్లేదు!

స్పష్టం చేసిన రైల్వే బోర్డు ఛైర్మన్‌

దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ లాక్‌డౌన్‌ భయాలతో వలస కూలీలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో చాలా రాష్ట్రాల్లో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిణామాలపై స్పందించిన రైల్వే బోర్డు ఛైర్మన్‌ సునీత్‌ శర్మ.. రైలు సేవలను నిలిపివేసే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. అవసరమైతే డిమాండ్‌ను బట్టి మరిన్ని రైళ్లను పెంచుతామని హామీ ఇచ్చారు. 

‘‘రైలు సేవలను తగ్గించడం లేదా నిలిపివేసే ప్రణాళికేదీ లేదు. అవసరమైనన్ని రైళ్ల రాకపోకలను కొనసాగిస్తాం. వేసవి సీజన్‌లో రైళ్లలో రద్దీ సహజమే. ప్రస్తుతం రైళ్ల కొరత లేదు. ఒకవేళ ప్రయాణికుల రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా రైళ్ల సేవలను కూడా పెంచుతాం’’ అని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేగాక, రైళ్లలో ప్రయాణించేందుకు కొవిడ్‌ నెగెటివ్‌ పత్రం తప్పనిసరి అని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. రైల్వేలో అలాంటి పత్రం అడగట్లేదని స్పష్టం చేశారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని