జీఎస్‌టీలోకి పెట్రోల్‌.. ప్రస్తుతం ఆ ప్రతిపాదన లేదు! - no proposal to bring petroleum products under gst
close
Published : 15/03/2021 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీఎస్‌టీలోకి పెట్రోల్‌.. ప్రస్తుతం ఆ ప్రతిపాదన లేదు!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవా పన్ను(జీఎస్‌టీ)లోకి తెచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం, గ్యాస్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిపై జీఎస్‌టీ కౌన్సిల్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన చేయలేదని లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చింది. పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్నులోకి తెచ్చే అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ సరైన సమయంలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో వీటిని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను తగ్గించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అదే సమయంలో రాష్ట్రాలు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్సైజ్‌, వ్యాట్‌ తగ్గింపు విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పరస్పరం ఆలోచన చేయాల్సి ఉందని అనురాగ్‌ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. గతేడాది మార్చి నెలలో క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 19డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది 65డాలర్లకు పెరిగిందని అనురాగ్‌ ఠాకూర్‌ గుర్తుచేశారు.

రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించేందుకు వీటిని జీఎస్‌టీలోకి తీసుకురావాలనే డిమాండ్‌ గత కొంతకాలంగా ఎక్కువైంది. ఇంధన ధరలను జీఎస్‌టీలోకి తీసుకురావడం వల్ల ధరలను తగ్గించవచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని