Cricket News: 11 మంది పుజారాలు పంత్‌లు ఉండరు కదా! - no team have 11 pujaras 11 pants says team india batting coach
close
Updated : 04/06/2021 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket News: 11 మంది పుజారాలు పంత్‌లు ఉండరు కదా!

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌

ముంబయి: ఏ జట్టులోనూ 11 మంది పుజారాలు.. 11 మంది పంత్‌లు ఉండరని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నారు. ఆట పరంగా వారి మనస్తత్వాలు వేరుగా ఉంటాయని పేర్కొన్నారు. ఆటగాడిని బట్టి శిక్షణ ఉంటుందన్నారు. మ్యాచులో ఎప్పుడెలా ఆడాలో విరాట్‌ కోహ్లీని మించి ఎవరికీ తెలియదన్నారు. రోహిత్‌ నియంత్రణ సాధించాడని వెల్లడించారు. ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు విక్రమ్‌ మీడియాతో మాట్లాడారు.

‘జట్టులో బృంద చర్చలు ఎప్పుడూ జరుగుతుంటాయి. జట్టు దృక్పథాన్ని మెరుగుపరుస్తాయి. అందుకు భిన్నంగా నేను ఒక్కొక్కరితోనూ ప్రత్యేకంగా మాట్లాడతాను. ఉదాహరణకు పుజారా, పంత్‌ భిన్నమైన మనస్తత్వాలు, పని విలువలు కలిగిన వారు. వారు చెప్పేది జాగ్రత్తగా వింటేనే వారి గురించి బాగా అర్థమవుతుంది. వారు ఎలాంటి పరిష్కారాలు కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఎక్కువ ప్రతిభ, వైవిధ్యం గలవారితో విడివిడిగా మాట్లాడటం అవసరం’ అని విక్రమ్‌ అన్నారు.

‘పుజారాకు అంకితభావం ఎక్కువ. పట్టుదలగా, క్రమశిక్షణతో ఉంటాడు. క్రికెట్లోనే కాదు అతడి జీవనశైలీ ఇలాగే ఉంటుంది. ఒకే తరహా పద్ధతులు ఉంటాయి. ఇక పంత్‌ నిర్భయంగా సరదాగా ఉంటాడు. తన శైలిలో ఆడేందుకు ఇష్టపడతాడు. మరి ఏ జట్టులోనూ 11 మంది పుజారాలు, 11 మంది పంత్‌లు ఉండరు కదా. పంత్‌, పుజారా గెలుపు కూర్పులో ఉండాల్సిందే. అందుకే వారిని వారి శైలిలోనే ఉండనివ్వడం ముఖ్యం. నా వరకు పుజారా అదనంగా తన అమ్ముల పొదిలో కొత్త షాట్లు సంపాదించుకోవడం, పంత్‌ అవసరమైతే ఎక్కువ బంతులు డిఫెండ్‌ చేయగలిగేలా చేయడమే ముఖ్యం’ అని రాఠోడ్‌ తెలిపారు.

సారథి విరాట్‌ కోహ్లీ అత్యంత పరిణతి కలిగిన ఆటగాడని విక్రమ్‌ ప్రశంసించారు. 2016లో ఐపీఎల్‌లో నాలుగు సెంచరీలు, భారీ సిక్సర్లు బాదిన అతడే వెస్టిండీస్‌లో గాల్లోకి కొట్టకుండానే ద్విశతకం చేశాడని గుర్తు చేశారు. టెస్టుల్లోనూ రాణిస్తున రోహిత్‌శర్మ తన ఆలోచనలు, బ్యాటింగ్‌పై నియంత్రణ సాధించాడని పేర్కొన్నారు. అజింక్య రహానె గొప్ప ఆటగాడని జట్టు విజయం కోసమే కృషి చేస్తాడని వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని