Nokia 4G: నోకియా నుంచి కొత్తగా కీప్యాడ్‌ ఫోన్‌... ఫీచర్లేంటంటే! - nokia launches feature phone with hd calling feature
close
Updated : 23/07/2021 20:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nokia 4G: నోకియా నుంచి కొత్తగా కీప్యాడ్‌ ఫోన్‌... ఫీచర్లేంటంటే!

ఇంటర్నెట్‌డెస్క్‌: మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్లు బడ్జెట్‌ ధరల్లో అందుబాటులో ఉన్నా కొంత మంది కీపాడ్ ఉన్న ఫీచర్‌ పోన్లపైనే ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారి కోసం హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నోకియా ఫీచర్ ఫోన్ లైనప్‌లో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. నోకియా 110 4జీ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో హెచ్‌డీ కాలింగ్ ఫీచర్‌ ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం...

నోకియా 110లో 4జీ కనెక్టివితోపాటు హెచ్‌డీ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ ఇస్తున్నారు. దీంతో యూజర్స్ మెరుగైన కాలింగ్‌ అనుభూతిని ఆస్వాదించవచ్చు. సిరీస్ 30+ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 1.8-అంగుళాల క్యూవీజీఏ కలర్ డిస్‌ప్లే ఇస్తున్నారు. యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు 0.8ఎంపీ క్యూవీజీఏ కెమెరా అమర్చారు. 1,020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 13 రోజుల స్టాండ్‌బై, 16 గంటల మ్యూజిక్ ప్లే, 5 గంటల 4జీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఎఫ్ఎం రేడియో, ఎంపీ3, వీడియో ప్లేయర్స్‌తోపాటు స్నేక్ గేమ్, ఆక్స్‌వర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఇస్తున్నారు. 128 ఎంబీ ర్యామ్‌/48ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో 32జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. దీని ధర రూ. 2,799. జులై 24 నుంచి నోకియా, అమెజాన్ వెబ్‌సైట్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని