డైరెక్టర్‌ శంకర్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ - nonbailable warrant for director shankar in enthiran plagiarism case
close
Published : 31/01/2021 14:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డైరెక్టర్‌ శంకర్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

చెన్నై: ప్రముఖ దర్శకుడు శంకర్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. చెన్నైలోని ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేశారు. తాను రచించిన ‘జిగుబా’ కథను కాపీ కొట్టి శంకర్‌ ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించారని పేర్కొంటూ కొన్నేళ్ల క్రితం ప్రముఖ రచయిత అరుర్‌ తమిళ్‌నందన్‌ స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీంతో శంకర్‌ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం పలుమార్లు ఆదేశించినా.. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అంతేకాకుండా ఆయన న్యాయస్థానం ఎదుట కూడా హాజరుకాలేదు. దీంతో ఆయన పేరుమీద తాజాగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. అలాగే ఈ కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేసింది.

ప్రముఖ రచయిత అరుర్‌ తమిళ్‌నందన్‌ రచించిన ‘జిగుబా’ కథ 1996లో ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురించారు. అదే కథ 2007లో ఓ నవలగా ముద్రించారు. శంకర్‌ డైరెక్షన్‌లో రజనీకాంత్‌-ఐశ్వర్యరాయ్‌ నటించిన ‘రోబో’.. తన ‘జిగుబా’ కథేనని తమిళ్‌నందన్‌ అప్పట్లో ఆరోపణలు చేశారు. 2010లో ‘రోబో’ విడుదలైన వెంటనే కాపీ రైట్‌ యాక్ట్‌ కింద అరుర్‌ కోర్టును ఆశ్రయించారు.

ఇదీ చదవండి

థియేటర్లలో ఇకపై నూరు శాతం ఆక్యుపెన్సీ

పుష్ప షూట్‌.. బన్నీ ఎమోషనల్‌..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని