ఆయనతో స్ర్కీన్‌ పంచుకోవడం నా అదృష్టం: చెర్రీ - not a cameo but a fullfledged role in acharya says ramcharan
close
Updated : 29/01/2021 17:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయనతో స్ర్కీన్‌ పంచుకోవడం నా అదృష్టం: చెర్రీ

హైదరాబాద్‌: తన తండ్రి, మెగాస్టార్‌ చిరంజీవితో స్ర్కీన్ పంచుకోవడం అదృష్టమని నటుడు రామ్‌ చరణ్‌ తేజ్‌ అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఆచార్య’. ఇందులో చరణ్‌ ‘సిద్ధ’గా కీలకపాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌లో చరణ్‌ పాల్గొంటున్నారు. తాజాగా విడుదలైన ‘ఆచార్య’ టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ క్రమంలో చరణ్‌ ‘ఆచార్య’ సినిమాలో తానూ భాగం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

‘‘ఆచార్య’ సినిమా కోసం నాన్నతో కలిసి స్ర్కీన్‌ పంచుకోవడం నా అదృష్టం. ‘సిద్ధ’ పాత్రలో నటిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇందులో నాది అతిథి పాత్ర కాదు. నా వరకూ ఇది పూర్తి నిడివి ఉన్న పాత్ర. నాన్న సినిమాలో నటించడానికి నాకు అవకాశం కల్పించిన దర్శకుడు కొరటాల శివకు ధన్యవాదాలు’ అని రామ్‌చరణ్‌ వివరించారు.

అనంతరం సిద్ధ పాత్రకు రామ్‌చరణ్‌ను ఎంపిక చేసుకోవడం గురించి కొరటాల స్పందిస్తూ.. ‘ఈ సినిమాలో ‘సిద్ధ’ పాత్రకు రామ్‌చరణ్‌ తప్ప వేరే ఎవర్నీ ఊహించుకోలేకపోయాను. ఈ ప్రాజెక్ట్‌కు, ఆ పాత్రకు ఆయనే సరైన న్యాయం చేయగలరు’ అని పేర్కొన్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్‌.. చరణ్‌కు జంటగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు.

ఇవీ చదవండి

RRR: తారక్‌ ప్రేయసి జెన్నీఫర్‌ ఆగయా..!

ఆకట్టుకునేలా సుశాంత్‌ సినిమా టీజర్‌..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని