నేను ఆమెకు ముద్దు పెట్టలేదు: సల్మాన్‌ - not kissed disha patani says salman khan
close
Published : 02/05/2021 18:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను ఆమెకు ముద్దు పెట్టలేదు: సల్మాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీపడుతూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నాడు. అయితే.. ఆయన తన సినిమాల్లో మొదటి నుంచి లిప్‌లాక్‌ సీన్లకు దూరంగా ఉంటూ వస్తున్నాడాయన. తాజాగా సల్మాన్‌ నటించిన ‘రాధే’ చిత్రంలో ఒక లిప్‌లాక్‌ సీన్‌పై ఆయన స్పందించారు. ఈ చిత్రం రంజాన్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాగా.. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఇప్పటికే విడుదలైంది. అందులో సల్మాన్‌ ఒక సన్నివేశంలో హీరోయిన్‌ దిశాపటానికి ముద్దు పెడుతూ కనిపించాడు. అది కాస్తా సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే.. దానిపై సల్మాన్‌ స్పందించాడు.

‘ఈ సినిమాలో దిశా చాలా అద్భుతంగా నటించింది. ఆమె చాలా అందంగా ఉంది. ఇద్దరం ఒకే వయసువాళ్లలా కనిపించాం. అయితే.. దిశా నా వయసు వ్యక్తిలా కనిపించలేదు. నేనే ఆమె తోటి వయసువాడిలా కనిపించాను. ఇక లిప్‌లాక్‌ గురించి  మాట్లాడాలంటే.. అసలు అది లిప్‌లాక్‌ కాదు. ఎందుకంటే నేను ఆమె పెదాలపై ముద్దుపెట్టలేదు. అది కేవలం తెరపై మాత్రమే కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే.. అసలు నేను దిశాకు ముద్దుపెట్టలేదు. ఆ సినిమాకు ముద్దు సన్నివేశం చాలా అవసరం’ అని సల్మాన్‌ స్పష్టం చేశాడు. కాగా.. అల్లు అర్జున్‌ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’లోని ‘సీటీమార్‌’ పాటను ఈ సినిమాలో రీక్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. ఇందులో సల్మాన్‌ పవర్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. దిశా పటాని కథానాయిక. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని