Nothing Ear 1: 10 నిమిషాల్లో 8 గంటల ఛార్జింగ్  - nothing ear 1 earbuds launched in india
close
Published : 28/07/2021 22:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nothing Ear 1: 10 నిమిషాల్లో 8 గంటల ఛార్జింగ్ 

ఇంటర్నెట్‌డెస్క్: స్మార్ట్‌ ఫోన్లతోపాటు వాటికి అనుసంధానంగా ఉపయోగించే ఇయర్‌ బడ్స్‌కు క్రమంగా మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఇయర్‌బడ్స్‌ వస్తున్నాయి. తాజాగా నథింగ్ కంపెనీ తన తొలి ఇయర్‌బడ్స్‌ ఇయర్‌ 1ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌, ఛార్జింగ్‌ కేస్‌ని ట్రాన్స్‌పరెంట్‌గా డిజైన్ చేశారు. దీంతో చూసేందుకు ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాకుండా ఇయర్‌బడ్స్‌ ఛార్జ్ అవుతున్నప్పుడు కేస్‌ లోపలి ఛార్జింగ్ ఇండికేటర్‌ లైట్‌ను చూడొచ్చు. 

నథింగ్ ఇయర్‌ 1లో యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌తోపాటు మూడు హై డెఫినిషన్ మైక్‌లు ఉన్నాయి. ఇందులో నాయిస్‌ క్యాన్సిలేషన్ తీవ్రతను ఇయర్ 1 యాప్‌ ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి ఈ యాప్ అందుబాటులో ఉంది. ఇందులో 11.6 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ ఇస్తున్నారు. ఇయర్‌బడ్స్‌ని ఛార్జ్‌ చేసేందుకు యూఎస్‌బీ-సీ టైప్ ఛార్జర్‌ ఇస్తున్నారు. ఇది క్యూఐ వైరస్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇయర్‌బడ్స్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5.7 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్‌ కేస్‌తో 37 గంటలపాటు బ్యాటరీ స్టాండ్‌బైలో ఉంటుంది. వీటిని పది నిమిషాలు ఛార్జ్ చేస్తే 8 గంటలపాటు మ్యూజిక్‌ని ఆస్వాదించవచ్చని నథింగ్ తెలిపింది. భారత మార్కెట్లో వీటి ధర రూ.5,999గా కంపెనీ నిర్ణయించింది. ఆగస్టు 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని