Sonu soodకి నెగెటివ్‌ - now sonusood tests negetive for corona virus
close
Published : 23/04/2021 17:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonu soodకి నెగెటివ్‌

ముంబయి: రియల్‌ హీరో, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కి కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈనెల 17న తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సామాజిక మధ్యమాల వేదికగా పంచుకున్నారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆయన వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో శుక్రవారం ఆయనకు చేసిన కరోనా పరీక్షలు నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో సోనూసూద్‌ ఎన్నో సేవలు అందించారు. ప్రయాణ సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీల కోసం బస్సులు, రైళ్లను ఆయన ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా విదేశాల్లో చిక్కుకున్న కొంతమంది భారతీయ విద్యార్థులను సైతం స్వదేశానికి తీసుకువచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేయించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని