HBD NTR: 9999 సంగతి ఇదీ - ntr about his car number
close
Updated : 20/05/2021 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HBD NTR: 9999 సంగతి ఇదీ

ఇంటర్నెట్ డెస్క్: సినిమా వాళ్లలో చాలామందికి సెంటిమెంట్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ 9999 (కారు నంబరు) విషయంలో ఇదే అనుకుంటుంటారు. కానీ, కాదు. 9999 నంబరు.. ఎందుకు ఎంపిక చేసుకున్నారో ఓ సందర్భంలో ఇలా వివరించారు తారక్. 'సెంటిమెంట్స్‌పై నాకు పెద్దగా నమ్మకం లేదు. కానీ 9 అంకె అంటే చాలా ఇష్టం. తాతగారి (సీనియర్ ఎన్టీఆర్) కారు నంబరు 9999. అదే నంబరు నాన్న (హరికృష్ణ) కారుకి కనిపించేది. వాళ్లిద్దరినీ ఆరాధించే వ్యక్తిగా... నాకూ ఆ నంబరు అంటే మక్కువ పెరిగింది' అని తెలిపారు. కారు నంబరే కాదు తారక్  ట్విటర్ ఖాతాలోనూ 9999 కనిపిస్తుంది. సినిమా విషయానికొస్తే 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నారాయన. ఇది పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో న‌టించ‌నున్నారు.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని