ఆయన సినిమాలకు అభిమానిని: ఎన్టీఆర్‌ - ntr greets the ‘check’ team
close
Published : 25/02/2021 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన సినిమాలకు అభిమానిని: ఎన్టీఆర్‌

హైదరాబాద్: నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘చెక్‌’. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో చిత్రం తెరకెక్కుతోంది. వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నాయికలు. ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఎన్టీఆర్‌ తన ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ..‘‘చంద్రశేఖర్‌ యేలేటి ఎంచుకునే సినిమా ఇతివృత్తాలకు, కథ చెప్పే తీరుకు నెనెప్పుడూ అభిమానినే. అవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ‘చెక్‌’ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో నితిన్‌కి, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’’ అంటూ పేర్కొన్నారు.

దీనికి నితిన్‌ స్పందిస్తూ ‘మీ ప్రేమ పూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు తారక్‌ బ్రదర్‌. మీకు ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని సమాధానమిచ్చారు. మరోవైపు తారక్‌ ట్వీట్‌కు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కృతజ్ఞతలు తెలిపారు. ‘నీకున్న కోట్లాది అభిమానుల్లో నేనూ ఒకడిని. నీ సహకారం మర్చిపోలేను’ అని ట్వీట్‌ చేశారు.

ఇది ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ కథ. చదరంగం నేపథ్యంలో సాగుతుంది.  పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్‌ తదితరులు నటిస్తున్నారు. ప్రియా వారియర్‌కి ఇదే తొలి తెలుగు చిత్రం. కల్యాణి మాలిక్‌ సంగీత స్వరాలు సమకూర్చగా రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని