ట్విటర్‌లో ఎన్టీఆర్‌కి అరకోటి మంది అభిమానులు - ntr has over 50 million fans on twitter
close
Published : 30/05/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్విటర్‌లో ఎన్టీఆర్‌కి అరకోటి మంది అభిమానులు

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు చిత్రసీమలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్‌ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన చాలావరకు సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ అంతగా కనిపించరు. కానీ ఎప్పుడో ఒక్కోసారి సందర్భానుసారంగా పోస్టులు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ ఆయనను ట్విటర్‌లో అనుసరించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఫాలోవర్ల సంఖ్య అరకోటికి చేరింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎన్టీఆర్‌ అభిమానులు #5MFollowersForNTR అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. మే 28న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఒక్కరోజునే సుమారు రెండువేల మంది ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో ఎన్‌.టి.ఆర్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కొరటాల శివతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇక ‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తోనూ ఓ చిత్రం చేయనున్నారు.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని