కొరటాల చిత్రంలో కొత్తగా కనిపించనున్న ఎన్టీఆర్‌! - ntr will be seen in a new role in the next ntr30 movie
close
Published : 15/04/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొరటాల చిత్రంలో కొత్తగా కనిపించనున్న ఎన్టీఆర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్: సామాజిక ఇతివృత్తాలనే కథలుగా మలచుకుని చిత్రాలను రూపొందించే దర్శకుడు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేస్తున్నారు. ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఇంతవరకు చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నాడట. ఇందులో అతడు హిమాలయాల నుంచి పట్టణానికి చేరుకున్న ఓ యువకుడిగా, కల్లాకపటం తెలియని చిన్నపిల్లల మనస్తత్వం గల పాత్రలో కనిపిస్తాడట. గతంలో కొరటాల శివ - ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంలో అన్యాయాలను ఎదుర్కొంటూ, పర్యావరణాన్ని రక్షించే సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎన్టీఆర్‌ నటించి అలరించాడు. ‘ఎన్టీఆర్‌ 30’ చిత్రం ఈ ఏడాది జూన్‌లోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇందులో ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటితో సంప్రదింపులు జరుతున్నారని వార్తలొస్తున్నాయి. మరో కథానాయికగా దక్షిణాదికి చెందిన ప్రముఖ నటిని తీసుకోనున్నారట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో కొమరం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మే 13న ఈ సినిమా తెరపైకి రానుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని