NTR30: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ ప్లాన్‌ ఇదేనా? - ntr30 regular shoot to start from november
close
Published : 16/09/2021 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NTR30: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ ప్లాన్‌ ఇదేనా?

హైదరాబాద్‌: ‘RRR‌’తో తమ ప్రయాణాన్ని ముగించుకుని.. తదుపరి కొత్త చిత్రాల కోసం సిద్ధమవుతున్నారు కథానాయకులు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌. చరణ్‌ ఇప్పటికే శంకర్‌ సినిమాని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తారక్‌ తన కొత్త ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘NTR30’గా పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించనున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కల్యాణ్‌ రామ్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఈ సినిమా అక్టోబరు తొలి వారంలో లాంఛనంగా మొదలు కానుందని సమాచారం. నవంబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ‘జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ తర్వాత తారక్, కొరటాల కలయిక నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. పాన్‌ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. కథానాయికగా అలియా భట్‌ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్‌ నీల్‌తో ఓ చిత్రం చేయనున్నారు ఎన్టీఆర్‌.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు ఎన్టీఆర్‌. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కాగా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఇందులో ఆయన విప్లవ వీరుడు కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. మరో హీరో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తారు. మరోవైపు కొరటాల చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’కు తుది మెరుగులు దిద్దుతున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని