ఓసీఐ కార్డుదారులకు ప్రత్యేక అనుమతి అవసరం - oci cardholders require special permit if they want to undertake tabligh media activities govt
close
Published : 05/03/2021 23:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓసీఐ కార్డుదారులకు ప్రత్యేక అనుమతి అవసరం

నిబంధనల్లో సవరణలు చేసిన కేంద్ర హోంశాఖ

దిల్లీ: ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు ఇకపై దేశంలో చేసే మిషనరీ, తబ్లిగ్‌, పాత్రికేయ కార్యకలాపాలకు ముందుగా భారత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇతర దేశాల పాస్‌పోర్టులు కలిగి ఉన్న విదేశీయులకు భారత్‌లో కొన్ని ప్రత్యేక అనుమతులు ఇస్తూ ఓసీఐ కార్డులను జారీ చేస్తారు.  ఓసీఐ కార్డుదారులకు భారత పౌరులతో సహా అన్నింటిలో సమాన అవకాశాలు ఉంటాయి. దేశంలో జరిగే ప్రవేశ పరీక్షలు, భారతీయ చిన్నారుల దత్తత స్వీకారం వంటి వాటిల్లో వారికి అవకాశం కల్పిస్తుంది.  కానీ ప్రస్తుతం హోంశాఖ వెలువరించిన ప్రకటన ప్రకారం.. ఇకపై ఓసీఐ కార్డుదారులు ఏవైనా సామాజిక, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించినా, నిషేధించిన ప్రదేశాలకు వెళ్లాలనుకున్నా భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని సూచించింది. భారత్‌లో పర్యటించడానికి తప్పనిసరిగా ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. దీంతో పాటు పలు ఇతర సూచనలు కూడా ఆ ప్రకటనలో వెల్లడించారు.

గతేడాది మార్చిలో దేశమంతా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో సుమారు 2,500లకు పైగా తబ్లిగీ జమాత్‌ సభ్యులు దిల్లీలోని నిజాముద్దీన్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి నిర్వహించిన ఈ సమావేశంలో చాలా మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనకు సంబంధించి 233 విదేశీ తబ్లిగీ కార్యకర్తలను జూన్‌లో అరెస్టు చేశారు. అనంతరం 2,550 మంది విదేశీ తబ్లిగీ జమాత్‌ సభ్యులు పదేళ్లపాటు భారత్‌లో అడుగుపెట్టకుండా కేంద్ర హోంశాఖ బ్యాన్‌ చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని