యూట్యూబ్‌లో ‘శశి’ పాటకు రికార్డు వీక్షణలు - oke oka lokam nuvve records
close
Published : 25/04/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూట్యూబ్‌లో ‘శశి’ పాటకు రికార్డు వీక్షణలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని పాటలు సినిమాతో సంబంధం లేకుండా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ ఉంటాయి. థియేటర్లలో సినిమా అలరించినా.. అలరించలేకపోయినా.. కొన్ని పాటలు మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. ఇటీవల వచ్చిన ‘శశి’ చిత్రంలోని ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాట కూడా అదే కోవలోకి వస్తుంది. ఆది సాయికుమార్‌, సురభి జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కించారు. మార్చి 19న థియేటర్లలో విడుదలైందీ చిత్రం. ఈ సినిమాలోని పాటలు మాత్రం విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఒకేఒక లోకం’ పాట మాత్రం ఒక రేంజ్‌లో సక్సెస్‌ అయింది. ఫోన్‌ రింగ్‌టోన్‌.. ఇన్‌స్టాగ్రామ్‌.. ఎఫ్‌ఎమ్‌ ఛానళ్లు.. ఇలా ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. తాజాగా.. యూట్యూబ్‌లో 100మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకుంది. విడుదలై రెండు నెలలు దాటినా ఇంకా యూట్యూబ్‌ ట్రెండింగ్‌లోనే ఉంది. చంద్రబోస్ రచించిన ఈ పాటను సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. అరుణ్‌ చిలువేరు సంగీతం అందించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని