కోహ్లీని ఎలా ఔట్‌ చేయాలంటే.! - ollie robinson | man of the match
close
Published : 29/08/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీని ఎలా ఔట్‌ చేయాలంటే.!

ఇంటర్నెట్‌ డెస్కు: మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించడంలో పేసర్‌ ఓలి రాబిన్సన్‌ కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం అతడు మాట్లాడాడు. ‘మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవడమనేది నా కల. నేను ఆడుతున్న మొదటి సిరీస్‌లోనే ఈ అవార్డు గెలుచుకోవడం సంతోషంగా ఉంది. ఇక్కడ బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదించాను. పరిస్థితులు అనుకూలించడంతో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (5/65) చేయగలిగాను. సీనియర్‌ పేసర్ జేమ్స్‌ అండర్సన్‌తో కలిసి బౌలింగ్‌ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. అది నా ఆటతీరుని మరింత మెరుగుపరిచింది. నిత్యం నేర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అవుట్‌ చేయడం సంతోషంగా అనిపించింది. అతడిని ఔట్‌ చేయాలంటే 4, 5 స్టంప్స్‌ స్ధానాల్లో ఫీల్డర్లను ఉంచి అవుట్‌సైడ్‌ బంతులేస్తే చాలు. కోహ్లీ వాటిని ముద్దాడి వారికి దొరికిపోతాడు. నేను ఇదే వ్యూహాన్ని అనుసరించి అతడిని అవుట్‌ చేశా’అని రాబిన్సన్ చెప్పుకొచ్చాడు. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని