‘గల్లీబాయ్‌’ జంట మరోసారి? - once again alia bhatt and ranveer singh share the screen
close
Published : 01/02/2021 13:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గల్లీబాయ్‌’ జంట మరోసారి?

ముంబయి: ‘గల్లీబాయ్‌’ జంట మరోసారి తెరపై సందడి చేయనుందని తెలుస్తోంది. రణ్‌వీర్‌ సింగ్, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టడమే కాదు ఈ చిత్రంలోని నటులకు పలు పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ నిర్మాణ సంస్థలో రణ్‌వీర్, అలియా జంటగా నటించడానికి కథ సిద్ధమైనట్లు సమాచారం.

ఈ చిత్రానికి కరణ్‌జోహారే దర్శకత్వం చేయనున్నారట. ఇది ఓ ప్రేమ కథా చిత్రమని సమాచారం. ఈ మధ్య కాలంలో కరణ్‌ ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రంతో పాటు ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ల్లోని కొన్ని భాగాలకు దర్శకత్వం వహించారు. అలియా బాలీవుడ్‌ ఎంట్రీ చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’కూ కరణే దర్శకుడు. రణ్‌వీర్‌సింగ్, అలియా ప్రధాన పాత్రల్లో ‘తఖ్త్‌’ అనే చిత్రాన్ని గతంలో ప్రకటించారు కరణ్‌. అది  తాత్కాలికంగా   ఆగినట్టు  సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని