‘డాక్టర్‌’ మళ్లీ వాయిదా - once again siva karthikeyan doctor movie postponed
close
Published : 14/05/2021 17:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘డాక్టర్‌’ మళ్లీ వాయిదా

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘రెమో’, ‘శక్తి’ వంటి చిత్రాలతో తమిళంతో పాటు తెలుగు వారికీ   దగ్గరయ్యారు నటుడు శివ కార్తికేయన్‌. ఇప్పుడాయన హీరోగా నెల్సన్‌ దిలిప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డాక్టర్‌’. ప్రియాంక మోహన్‌ కథానాయిక. ఓ విభిన్నమైన వినోదాత్మక కథాంశంతో రూపొందింది. ఇప్పటికే  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఈవారంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దీన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

పరిస్థితులు కాస్త కుదుట పడ్డాక కొత్త విడుదల తేదీపై స్పష్టత ఇస్తామని తెలియజేశారు. నిజానికి ఈ చిత్రం ఈ మార్చిలోనే  విడుదల కావాల్సి ఉంది. తమిళనాట ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనెలకు వాయిదా వేశారు. కానీ, ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా మరోసారి వెనక్కు వెళ్లిపోయింది. ఈ సినిమా త్వరలో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని