కరోనా సోకిన మహిళకు అష్టకష్టాలు - one women sick with corona treatment rejected by pvt hospitals
close
Updated : 26/07/2020 18:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా సోకిన మహిళకు అష్టకష్టాలు

రాజమహేంద్రవరం: ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ కరోనా పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదు.. ప్రైవేటు ఆస్పత్రిలో చేయిస్తే.. పాజిటివ్‌గా నిర్థారణ అయింది.. కానీ చికిత్స అందించేందుకు ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో కరోనా బాధితురాలు.. కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా జాంపేటలో చోటుచేసుకుంది. ఆస్పత్రుల తీరుతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. పిల్లావారి వీధికి చెందిన ఓ మహిళ ఈ నెల 23న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా కరోనా ఫలితాలు రాకపోవడం, ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించారు. అందులో ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో కుటుంబసభ్యులు ఇంట్లోనే ఆ మహిళకు ఆక్సిజన్‌ సిలిండర్‌ అమర్చారు. అయినా ఆమె పరిస్థితి విషమిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని