మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని పిటిషన్‌ - online petion
close
Published : 12/09/2020 23:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని పిటిషన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: లండన్‌లోని మేడమ్ టుస్పాడ్స్‌లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మైనపు బొమ్మను ఏర్పాటు చేయాలని అతడి అభిమానులు ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ మొదలు పెట్టారు. సుశాంత్‌ ఆత్మహత్య ఘటనపై సీబీఐ, ఎన్‌సీబీ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. పేదలకు సహాయం చేస్తున్న, మొక్కలు నాటుతున్న ఫొటోలను సుశాంత్‌ ఆత్మహత్య అనంతరం అభిమానులు పంచుకోవడం మొదలుపెట్టారు. ఇవి మాత్రమే కాకుండా సుశాంత్‌ విగ్రహన్ని లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో  ఏర్పాటు చేయాలని అభిమానులు ఛేంజ్‌.ఓఆర్‌జీలో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుశాంత్‌ అభిమానులు పిటిషన్‌పై సంతకం చేయాలని వారు కోరుతున్నారు. రెండు లక్షల మందితో ఈ పిటిషన్‌పై సంతకం చేయించాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే 1.7లక్షల మంది సంతకం చేశారు. లండన్‌కు చెందిన సోఫి రెహమాన్‌ అనే మహిళ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆ పిటిషన్ లో....‘‘మహిళ సాధికారతను ప్రమోట్‌ చేయడానికి నీతి ఆయోగ్‌ సుశాంత్‌ను నియమించింది. అతడిని మనం స్మరించుకోవాలంటే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు విగ్రహన్ని ఏర్పాటు చేయాలి’’ పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని