ఏపీ: ఏవేడుకైనా 50 మందికే అనుమతి - only 50 members will allow for any program in ap
close
Updated : 26/04/2021 23:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ: ఏవేడుకైనా 50 మందికే అనుమతి

రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

అమరావతి: కరోనా విలయతాండవం చేస్తున్న వేళ మహమ్మారి నివారణకు ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఇకపై రాష్ట్రంలో ఏ వేడుకకైనా 50 మందికే అనుమతిస్తామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు, ఈతకొలనులను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. 50 శాతం సామర్థ్యంతోనే ప్రజా రవాణా, సినిమాహాళ్లకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.

అన్ని కార్యాలయాల్లో  దూరం పాటించాలని సింఘాల్‌ కోరారు. ఒకే కాల్‌సెంటర్‌ ద్వారా ఆస్పత్రుల్లో పడకల కేటాయింపు, అడ్మిషన్లు జరగాలన్నారు. ‘‘రెమ్‌డెసివిర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 11వేల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రానికి 341 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించింది. కానీ, అది సరిపోవడం లేదు. మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగాన్ని పర్యవేక్షిస్తాం. చాలా చోట్ల ఆక్సిజన్‌ వృథా అవుతోంది. అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ వాడుతున్నారు’’ అని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు వివరించారు.

1 నుంచి వ్యాక్సిన్‌ సాధ్యం కాకపోవచ్చు!

మే 1 నుంచి 18 నుంచి 45ఏళ్ల మధ్య వయస్సున్నవారికి కూడా వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని కేంద్రం తలపెట్టినప్పటికీ ఏపీ కార్యరూపం దాల్చే పరిస్థితులు కనిపించడం లేదు. అవసరమైన డోసుల కోసం ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరిపినా టీకా డోసులు అందుబాటులో లేవని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. మే నెలతోపాటు జూన్‌లోనూ పలువారాల పాటు జరిగే వ్యాక్సిన్ల ఉత్పత్తి.. కేంద్రంతో ఒప్పందం మేరకు సరఫరాకే సరిపోతుందని ఆయా సంస్థలు స్పష్టం చేశాయన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని