అది మనుషుల అదృష్టం: త్రివిక్రమ్‌  - only humans can see the all the colours says thrivikram
close
Published : 21/03/2021 23:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది మనుషుల అదృష్టం: త్రివిక్రమ్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్ని జంతువులు ఏడు రంగులను చూడలేవు.. మనుషులకు మాత్రమే ఆ అదృష్టం ఉందని దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అన్నారు. ‘రంగ్‌ దే!’ చిత్ర ప్రిరిలీజ్‌ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నాకు బాగా నచ్చినవి అర్జున్‌, అను(నితిన్‌, కీర్తి) పాత్రలు. నితిన్‌ నా సోదరుడిలాంటి వాడు. నా మిత్రుడు దేవి శ్రీప్రసాద్‌. చాలామంది సంగీత దర్శకులు ఉంటారు. కానీ.. డీఎస్పీ మాత్రం ఒక ప్యాకేజీ. ఎలాంటి పాటకైనా మనతో స్టెప్పులేయించగలరు. మన దేశంలో అతి కొద్దిమంది గొప్ప మ్యూజిక్‌ డైరెక్టర్లలో దేవి ఒకరు. అందుకే టాప్‌లో దూసుకెళుతున్నారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడాలంటే.. ‘అన్ని జంతువులు నవ్వలేవు.. మనిషి మాత్రమే నవ్వగలడు’ అంటారు కదా.. అలాగే అన్ని జంతువులకు ఏడు రంగులను చూసే అవకాశం ఉండదు. మనిషికి మాత్రమే అన్ని రంగులను చూసే అదృష్టం ఉంది. అలాంటిది ‘రంగ్‌ దే’ పేరుతో వస్తున్న ఈ సినిమా కూడా జీవితంలో ఉన్న ఏడు రంగులను చూపిస్తుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని త్రివిక్రమ్‌ ముగించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని