close
Published : 13/03/2021 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఓ పాప..’పూర్తి వీడియో సాంగ్‌ చూసేయండి!

హైదరాబాద్‌: అనిల్‌ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాలి సంపత్‌’. శివరాత్రి పర్వదినాన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మూవీలోని ‘ఓ పాప...’అంటూ సాగుతున్న హుషారైన గీతాన్ని చిత్ర బృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. కథానాయిక లవ్‌లీసింగ్‌, శ్రీవిష్ణు తమదైన స్టెప్పులతో మెప్పిస్తున్నారు. ముఖ్యంగా బీచ్‌ లోకేషన్లలో ఎంతో అందంగా చిత్రీకరించారు. ఈ పాటను బెన్నీ దయాళ్‌, బెన్ హ్యూమన్‌,అనుదీప్‌ దేవ్‌ ఆలపించగా రామజోగయ్యశాస్త్రి సాహిత్యమందించారు. అచ్చు స్వరాలు సమకూర్చారు. ‘అలా ఎలా’ ఫేమ్‌ అనీష్‌కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి మిత్రుడైన ఎస్‌. కృష్ణ నిర్మించారు. ఆయన కథను అందించటం విశేషం. మరి లేటేందుకు ‘ఓ  పాప..’అంటూ హుషారుగా సాగుతున్న ఆ గీతాన్ని మీరు చూసేయండి!
 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని