Oppo colorOS: ‘కలర్‌’ఫుల్‌గా ఒప్పో ఓఎస్‌ అప్‌డేట్‌ - oppo ready to launch new version of coloros
close
Updated : 18/09/2021 11:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oppo colorOS: ‘కలర్‌’ఫుల్‌గా ఒప్పో ఓఎస్‌ అప్‌డేట్‌

ఇంటర్నెట్ డెస్క్‌: కలర్‌ఓఎస్ (colorOS) అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను తీసుకురాబోతున్నట్లు ఒప్పో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరిన్ని కొత్త ఫీచర్లతో colorOS 12 వెర్షన్‌ను యూజర్లకు ఉపయోగపడేలా తీసుకువస్తున్నట్లు పేర్కొంది. ఆండ్రాయిడ్ ఫ్యామిలీకి చెందిన కలర్‌ఓఎస్ ఒప్పో, వన్‌ప్లస్‌, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రత్యేకంగా తయారైంది. త్వరలో రాబోయే కలర్‌ఓఎస్ 12 వెర్షన్‌కు ఆండ్రాయిడ్‌ 12కి కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. కలర్‌ఓఎస్‌ 12 వెర్షన్‌ కొత్త ఫీచర్లు ఏంటో తెలుసుకుందామా..!

ColorOS 12 ఫీచర్లు ఇవే..

యూజర్‌ ఇంటర్‌ఫేస్ యానిమేషన్స్‌, అవతార్స్‌ వంటి కొత్త డిజైన్‌ ఐకాన్స్‌తో మారనుంది. 
యూఐ ఆప్టిమైజ్‌డ్‌ పొజిషన్‌: చాలా స్పేస్‌ ఇవ్వడం వల్ల ఎలాంటి కన్‌ఫ్యూజ్‌ లేకుండా ఉంటుంది.
టెక్ట్స్‌ కాంట్రాస్ట్ పెరిగింది. కలర్‌ షేడ్‌లను అదనంగా చేర్చారు.
ఆరు కొంగొత్త టూల్స్‌తో స్మార్ట్‌ సైడ్‌బార్ 2.0
మెరుగైన పీసీ-స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
కార్‌ స్క్రీన్‌ ప్రొజెక్షన్‌ పనితీరు మెరుగుపరచడం, డిస్‌ప్లేలో కనిపించే  యాప్‌ల సంఖ్యను పెంచుకోవడం
ఎమోజీలు తెలుసు కదా.. అలానే ఓమోజీల రూపకల్పన
300 కొత్త యానిమేషన్స్‌
యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లోని లాగ్‌ నియంత్రించేలా ఏఐ వినియోగం
సెక్యూరిటీ, ప్రైవసీకి సంబంధించిన కొత్త ఫీచర్లు

ఇప్పటికే కలర్‌ఓఎస్ 12 బీటా వెర్షన్‌ Find X3 ప్రో ఫొటోగ్రాఫర్ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌లో అప్‌డేట్‌ అయింది. Find X3 సిరీస్‌, వన్‌ప్లస్‌ 9 సిరీస్‌లోనూ బీటా వెర్షన్‌ టెస్టింగ్‌ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంవత్సరం అక్టోబర్‌ నుంచి వచ్చే ఏడాది మధ్య వరకు విడతల వారీగా స్మార్ట్‌ఫోన్లలో టెస్టింగ్‌ జరపనుంది. మరి ఏ బ్రాండ్‌ మొబైల్స్‌కు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే..

అక్టోబర్‌ 2021 నుంచి: Find X3 సిరీస్‌, వన్‌ ప్లస్‌ 9 సిరీస్‌
నవంబర్‌ 2021 నుంచి: Find X2 సిరీస్‌, రెనో 6 సిరీస్‌
డిసెంబర్‌ 2021 నుంచి: ఒప్పో ఏస్‌ సిరీస్, రెనో 5 సిరీస్, కే9 సిరీస్‌
2022 తొలి అర్ధ భాగం నుంచి: వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 8 సిరీస్, వన్‌ప్లస్‌ 7 సిరీస్‌, రెనో 4 సిరీస్, రెనో 3 సిరీస్, కే9 ప్రో, కే7 సిరీస్,ఏ 93s,A92s,A72,A55,A53



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని