దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్‌ సర్‌!  - orey bammardhi teaser glimpse
close
Published : 09/04/2021 23:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్‌ సర్‌! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిద్దార్థ్‌, జీవీ ప్రకాశ్‌ కుమార్‌ కలిసి నటిస్తోన్న చిత్రం ‘ఒరేయ్‌ బామ్మర్ది’. కశ్మీర పరదేశి, లిజోమోల్‌ జోస్‌ నాయికలు. ‘బిచ్చగాడు’ ఫేం శశి దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలైంది. ‘రోడ్డే సర్‌ నా ఆఫీస్‌.. మాడ్చే ఎండే నాకు ఏసీ’ అంటూ సిద్దార్థ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తి పెంచుతోంది. ట్రాఫిక్‌ పోలీసు అధికారిగా సిద్దార్థ్‌, రూల్స్‌ పాటించకుండా.. బైక్‌ రేసులంటూ తిరిగే వ్యక్తిగా ప్రకాశ్‌ కుమార్‌ కనిపిస్తున్నారు. వీళ్లద్దరూ పోటీపడి చెప్పే సంభాషణలు మెప్పిస్తున్నాయి. ‘మన దేశం గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్కరి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు సర్‌. రోడ్లు చెప్పేస్తాయ్‌ దేశం గురించి’ అని సిద్ధు చెప్పిన డైలాగ్‌ ఆలోచింపజేస్తోంది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని రమేశ్‌ పి. పిళ్లై నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎన్‌.బాలాజీ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్దూ కుమార్‌, ఛాయాగ్రహణం: ప్రసన్న కుమార్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని