OTT: ఈ వారం సందడి చేయనున్న సినిమాలివే! - ott movies releasing this week
close
Updated : 05/07/2021 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

OTT: ఈ వారం సందడి చేయనున్న సినిమాలివే!

గతవారం ‘హసీన్‌ దిల్‌రుబా’, ‘కోల్డ్‌ కేస్’‌, ‘ది టుమారో వార్‌’ ఓటీటీల్లో విడుదలై ఆకట్టుకున్నాయి. ఈ సారి కూడా సినీ ప్రియుల్ని అలరించేందుకు కొన్ని చిత్రాలు సిద్ధమైపోయాయి. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా తొలిసారి  డిజిటిల్‌ అరంగేట్రం చేస్తుండగా, మలయాళ నటి అన్నా బెన్‌ మరోసారి కొత్త కథాంశంతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. విజయ్‌సేతుపతి ఓ తమిళ అనువాదం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు.  ఆ సినిమాలు ఏంటి? ఏ రోజున విడుదల అవుతున్నాయో చూద్దాం. 

సారాస్‌

అన్నాబెన్‌ నటించిన మలయాళ చిత్రం ‘సారాస్’‌. అమెజాన్‌ ప్రైమ్‌లో ఇవాళే(జులై 5) విడుదలైందీ సినిమా. జూడ్‌ ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వం వహించారు.  ‘కుంబలాంగి నైట్స్‌’ సినిమాతో అరంగేట్రం చేసి ‘కప్పెలా’, ‘హెలెన్‌’ లాంటి హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అన్నాబెన్‌ నటించిన ‘సారాస్‌’పై అంచనాలు పెరిగాయి.  ఇందులో ఆమె అసోసియేట్‌ డైరెక్టర్‌గా కనిపించనుంది.  పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం ఉండని యువతి. ఎప్పటికైనా మెగాఫోన్‌ పట్టి సినిమా తీయాలనేది ఆమె కల.  మరి  ఆ కలను సారా నెరవేర్చుకుందా? ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది తెలియాలంటే ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని చూడాల్సిందే. 

 సేతుపతి విక్రమార్కుడు

తమిళంలో 2018లో విడుదలైన ‘జుంగా’  తెలుగులో ‘విక్రమార్కుడు’గా  అనువాదమైంది. సాయేషా, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని గోకుల్‌ తెరకెక్కించారు. విజయ్‌ సేతుపతి ఇందులో డాన్‌గా కొత్తగా కనిపిస్తున్నాడు. యోగిబాబు ఓ కీలక పాత్ర పోషించారు.  యాక్షన్‌ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ‘విక్రమార్కుడు’  మూవీ జులై 9న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమ్‌ కానుంది. 

స్టేట్‌ ఆఫ్ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా డిజిటల్‌ అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్’‌. గుజరాత్‌లోని అక్షర్‌ధామ్‌ దేవాలయంపై జరిగిన తీవ్రవాదుల దాడి ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో అక్షయ్‌ ఖన్నా ఎన్ఎస్‌జీ కమాండర్‌ హనుత్‌ సింగ్‌గా కనిపించనున్నారు.  ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.  ఈ చిత్రం జీ5 ఓటీటీలో జులై 9న విడుదల అవుతుంది. 

ఒక చిన్న విరామం

పునర్నవి భూపాలం కీలక పాత్రలో సంజయ్‌ వర్మ, గరిమా హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్‌ మూవీ ‘ఒక చిన్న విరామం’. ఈ శుక్రవారం(జులై 9) నుంచి ఆహాలో స్ట్రీమ్‌ కానుంది. బిజినెస్‌ మ్యాన్‌ అయిన దీపక్‌ లాభాలు సాధించాలని తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో తెరకెక్కింది. 2020లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. 

ఈ వారం ఓటీటీల్లో విడుదలవుతున్న మరికొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు

సినిమా పేరు ఎప్పుడు విడుదల  ఎక్కడ చూడొచ్చు!
యు ఆర్‌ మై స్ర్పింగ్‌ జులై 5 నెట్‌ఫ్లిక్స్‌
ఐ థింక్‌ యు షుడ్‌ లీవ్‌ విత్‌ టిమ్‌ రాబిన్సన్‌: సీజన్‌ 2 జులై 6 నెట్‌ఫ్లిక్స్‌
వేలుక్కక్క ఒప్పు కా జులై 6 బుక్‌ మై షో స్ట్రీమ్‌
మాన్‌స్టర్‌ ఎట్ వర్క్‌ జులై 7 డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
ది వార్‌ నెక్స్ట్‌ డోర్‌ జులై 7 నెట్‌ఫ్లిక్స్‌
రెసిడెంట్‌ ఈవిల్‌: ఇన్ఫెనిట్ డార్క్‌నెస్‌ జులై 8 నెట్‌ఫ్లిక్స్‌
చతుర్‌ ముఖం జులై 9 జీ5
ఆప్టికల్‌: సీజన్‌ 4 జులై 9 నెట్‌ఫ్లిక్స్‌
కాలర్‌ బాంబ్‌ జులై 9 డీస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
వర్జిన్‌ రివర్‌: సీజన్‌ 3 జులై 9 నెట్‌ఫ్లిక్స్‌
ఫస్ట్‌ కౌ జులై 9 ముబి ఇండియా
వన్‌ ఫర్‌ ఆల్‌ జులై 9 బుక్‌మై షో స్ట్రీమ్‌
హౌ ఐ బికమ్‌ ఏ సూపర్‌ హీరో జులై 9 నెట్‌ఫ్లిక్స్‌
క్రష్‌ జులై 9 జీ 5
లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌ జులై 9 జీ5
హిడెన్‌ టేస్ట్‌ ఆఫ్‌ గుజరాత్‌ జులై 9 ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌
క్రాల్‌ జులై 11 నెట్‌ఫ్లిక్స్‌
డోరా అండ్‌ ది లాస్ట్‌ సిటీ ఆఫ్‌ గోల్డ్‌ జులై 11 నెట్‌ఫ్లిక్స్‌


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని