కరోనాపై మన పోరాటం ప్రపంచానికే ప్రేరణ: మోదీ   - our fight against corona is inspiring the world says modi
close
Published : 16/02/2021 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై మన పోరాటం ప్రపంచానికే ప్రేరణ: మోదీ 

దిల్లీ: కరోనా వైరస్‌పై భారత్‌ చేసిన పోరాటం ప్రపంచ దేశాలకే ప్రేరణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మహమ్మారి ప్రవేశించిన సందర్భంలో ఇతర దేశాలు భారత్‌లో పరిస్థితిపై ఆందోళన చెందాయని గుర్తు చేశారు. ప్రపంచ శ్రేయస్సును కాంక్షిస్తూ భారత్‌ మానవతా దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు. మంగళవారం ఆయన శ్రీ రామచంద్ర మిషన్‌ ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా వర్చువల్‌ సదస్సులో ప్రసంగించారు. కరోనా తొలినాళ్లలో మన దేశంలో పరిస్థితిపై ప్రపంచమంతా ఆందోళన చెందిందన్నారు. కానీ, ఈ రోజు కరోనా మహమ్మారిపై భారత్‌ చేసిన పోరాటం యావత్‌ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. గత ఆరేళ్లుగా భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందన్నారు. పేదలకు అవకాశాలు ఇచ్చి, వారు హుందాగా జీవించేలా కృషిచేస్తోందని చెప్పారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని