లాక్‌డౌన్‌లో డిప్రెషన్‌కి లోనయ్యా: నటుడు - out of work and was feeling depressed saysthakur anoop singh
close
Published : 13/03/2021 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌లో డిప్రెషన్‌కి లోనయ్యా: నటుడు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా పని లేకపోవడంతో తాను డిప్రెషన్‌కు లోనయ్యానని నటుడు ఠాకూర్‌ అనూప్‌ సింగ్ తెలిపారు‌. ‘మహాభారతం’ ధారావాహికతో గుర్తింపు తెచ్చుకున్న ఠాకూర్‌ ప్రతినాయకుడి పాత్రల్లో నటిస్తూ వెండితెర వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. తాజాగా ఆయన రవితేజ చిత్రంలో నటించే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకున్నారు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’లో అనూప్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

‘‘అందరిలాగే నాకు కూడా లాక్‌డౌన్‌ ఎంతో కష్టకాలంగా గడిచింది. పని‌ లేకపోవడంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యా. బరువు బాగా పెరిగా. ఓ సమయంలో నా బరువు 105 కిలోలకు చేరింది. ‘ఖిలాడి’లో రోల్‌ ఉందని ఓ వ్యక్తి ద్వారా తెలుసుకున్నాను. వెంటనే ముంబయి నుంచి హైదరాబాద్‌కు చేరుకుని దర్శకుడిని కలిశాను. వృత్తిపట్ల నాకున్న నిబద్ధత ఆయనకు నచ్చడంతో వెంటనే రోల్‌ ఇచ్చారు. ఆరోజు నుంచి ఎంతో కష్టపడి పనిచేస్తున్నా. శరీరాకృతిని మార్చుకున్నాను’’ అని అనూప్‌ తెలిపారు. సూర్య కథానాయకుడిగా నటించిన ‘సింగం-3’లో అనూప్‌ ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని