కరోనా ‘మహా’ విజృంభణ: మళ్లీ 15వేలు పైనే - over 15000 covid cases in maharashtra
close
Published : 13/03/2021 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ‘మహా’ విజృంభణ: మళ్లీ 15వేలు పైనే

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. మళ్లీ అక్కడ కొత్త కేసులు 15 వేలు దాటాయ్‌. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ భారీగానే నమోదయ్యాయి. నిన్న 15,817 పాజిటివ్‌ కేసులు రాగా.. గడిచిన 24 గంటల్లో 15,602 కొత్త కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,97,793కు చేరింది. 21,25,211 మంది డిశ్చార్జి కాగా.. 52,811 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,18,525 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే 97,918 శాంపిల్స్‌ పరీక్షించిన అధికారులు ఇప్పటిదాకా 1,74,08,504 పరీక్షలు నిర్వహించినట్టు ప్రకటనలో వెల్లడించారు.

తాజాగా మరో 7,416మంది డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో నాగ్‌పూర్‌లో 1,828 రాగా.. ముంబయిలో 1709, పుణెలో 1667 చొప్పున నమోదయ్యాయి. ముంబయిలో మొత్తం కేసుల సంఖ్య 3,14,999కి చేరింది. కొత్తగా మరో ఐదుగురు మరణించడంతో అక్కడ కొవిడ్‌ మృతుల సంఖ్య 11,528కి చేరిందని అధికారులు వివరించారు.

ఈ ఏడు రాష్ట్రాల్లోనే అధిక ప్రభావం.. 
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొంతవరకు కేసులు పెరగడంతో దేశంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో వస్తున్న రోజువారీ కేసుల్లో 88% ఈ ఏడు రాష్ట్రాల్లోనే నమోదవుతుండటం గమనార్హం. మరోవైపు, 20 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్‌ కేసులు 1000 కన్నా తక్కువే ఉన్నాయి. శుక్రవారం రోజున 18 రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని