సుమారు 84 శాతం కేసులు ఆ ఆరు రాష్ట్రాల్లోనే.. - over 2.4 crore covid-19 vaccine doses administered so far across india
close
Published : 10/03/2021 21:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 సుమారు 84 శాతం కేసులు ఆ ఆరు రాష్ట్రాల్లోనే..

19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాలు సున్నా..
103 ఏళ్ల వృద్ధురాలికి టీకా.. రికార్డు నమోదు 

దిల్లీ: దేశంలో గత కొద్దిరోజులుగా నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,921 కొత్త కేసులు నమోదవగా, ఇందులో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడులలో ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. దీంతో దేశంలో నమోదయిన కేసుల్లో 84 (83.76)శాతం ఈ ఆరు రాష్ట్రాల్లోనే  వచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో  క్రియాశీల కేసుల సంఖ్య 1.84 లక్షలకు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 9,927 కేసులు రాగా.. కేరళలో 2,316, పంజాబ్‌లో 1,027  కొత్త కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గడిచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కరు కూడా కరోనా వల్ల మరణించలేదని అధికారులు తెలిపారు.  
మరో వైపు  దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటి వరకు 3,39,145 సెషన్లలో కలిపి 2.43(2,43,67,906) కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 71,30,098 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌, 69,36,480 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి తొలి డోస్‌ ఇవ్వగా, 38,90,257 మంది హెచ్‌సీడబ్ల్యూ, 4,73,422 మంది ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలకు రెండో డోస్‌ అందించినట్లు తెలిపారు. కాగా, గడిచిన 24 గంటల్లో 13.5 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. కర్ణాటకకు చెందిన వయోవృద్ధురాలు జె. కామేశ్వరికి టీకా ఇవ్వడంతో దేశంలో 103 ఏళ్ల వయసులో వ్యాక్సిన్‌ తీసుకున్న  మహిళగా రికార్టు సృష్టించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని