మున్నార్‌లో 450 మంది మీద కేసు నమోదు - over 400 kerala priests booked for violating covid norms at munnar gathering
close
Published : 07/05/2021 21:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మున్నార్‌లో 450 మంది మీద కేసు నమోదు

తిరువనంతపురం: ఇడుక్కిలో కరోనా నిబంధలను ఉల్లంఘించినందుకు 450 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలో బహిరంగ కార్యక్రమాలకు 200 మందికి మాత్రమే అనుమతి ఉండగా ఏప్రిల్‌ 13-17 మధ్య మున్నార్‌లోని సీఎస్‌ఐ చర్చి వార్షికోత్సవ వేడుకల్లో వందల మంది హాజరయ్యారు. సీఎస్‌ఐ చర్చి యాజమాన్యం కొవిడ్‌-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో, ఐపీసీ, కేరళ ఎపిడెమిక్‌ డిసీజ్‌ ఆర్డినెన్స్‌ సెక్షన్ల కింద 450 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమావేశం కారణంగా 100 మందికి పైగా కరోనా సోకిందని వాళ్లలో నలుగురు చనిపోయారని వెల్లడించారు. కానీ చర్చి యాజమాన్యం మాత్రం 20 మందికే కరోనా సోకిందని, వాళ్లకు మున్నార్‌ సమావేశానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని