దేశంలో 56 లక్షల మందికి టీకా: కేంద్రం - over 56 lakh people inoculated with covid19 vaccine no serious aefi health ministry
close
Published : 06/02/2021 23:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలో 56 లక్షల మందికి టీకా: కేంద్రం

దిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 56 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ అగ్నాని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పురోగతిపై ఆయన శనివారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలిడోసు టీకా ప్రక్రియను ఫిబ్రవరి 20 నాటికి పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు సూచించారు.

‘‘దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 56,36,868 మందికి కరోనా టీకా వేశాం. టీకా వేయించుకున్న వారిలో 52 లక్షలకు పైగా ఆరోగ్య సిబ్బంది ఉండగా.. మరో 3 లక్షలమందికి పైగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ ఉన్నారు. 13 రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ 60 శాతానికి పైగా నమోదైంది. ఈ విషయంలో 76.6 శాతంతో బిహార్‌ తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌లో (76.1 శాతం), త్రిపుర (76 శాతం), ఉత్తరాఖండ్‌ (71.5 శాతం), మిజోరాం (69.7 శాతం), యూపీ (69 శాతం), కేరళ (68.1 శాతం) ఉన్నాయి’ అని మనోహర్‌ తెలిపారు. ‘‘12 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 40 శాతం కన్నా తక్కువగా నమోదైంది. అత్యల్పంగా పుదుచ్చేరిలో 13.6 శాతం మాత్రమే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తైంది’’ అని వివరించారు. టీకా వృథాను అరికట్టేందుకు కృషి చేయాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో వ్యాక్సిన్‌ వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన స్థాయిలో ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోలేదని తెలిపారు. 

ఇదీ చదవండి

దేశవ్యాప్తంగా ముగిసిన చక్కాజామ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని