కొవిడ్‌ టీకా లభించును.. - overnight rush to distribute corona vaccine shots due to a failed freezer
close
Published : 31/01/2021 22:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 కొవిడ్‌ టీకా లభించును..

 

లక్ష్యం: 1600 డోసులు
గడువు: ఉదయం 3:45 గంటలు
వృధా చేయగల సమయం: 0 సెకెన్లు

ఆ రాత్రి కరోనా టీకా కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న వైద్యారోగ్య సిబ్బంది, వాలంటీర్ల సమర్ధతకు పరీక్ష పెట్టింది.. సమాజ సంపదను వృధా చేయరాదన్న వారి బాధ్యతాయుత ప్రవర్తనకు సవాలు విసిరింది.. ఇంతకీ ఏం జరిగిందంటే...

సియాటెల్‌ (అమెరికా): అమెరికా, సియాటెల్‌ నగరంలోని స్వీడిష్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అనే స్వచ్ఛంద సంస్థ 100 ఏళ్లకు పైగా  వైద్యసేవలు అందిస్తోంది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా యూడబ్యు మెడిసిన్‌ సంస్థతో సంయుక్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మోడెర్నా వ్యాక్సిన్‌ సీసాలను నిల్వ ఉంచాల్సిన ఫ్రిజ్‌.. జనవరి 28 రాత్రి తొమ్మిది గంటలకు ఉన్నట్టుండి పనిచేయటం మానేసింది. దానిలో ఇంకా 1600  కొవిడ్‌ టీకా డోసులున్నాయి. వందలాది ప్రాణాలకు రక్షణ కల్పించగల వ్యాక్సిన్‌, కొద్ది గంటల్లో వృధా కావటాన్ని వారు అంగీకరించలేకపోయారు. దీనిని అరికట్టేందుకు టీకాను ప్రజలకు అందించటం ఒకటే మార్గమని నిర్ధారణకు వచ్చారు.

నిజానికి ఆ మంచు కురుస్తున్న రాత్రి కనీసం 800 వందల మందిని సమీకరించటం పెద్ద సవాలే. ఐతే సిబ్బంది తమ పట్టుదల వీడలేదు.. ప్రయత్నాలు మానలేదు. చుట్టుపక్కల నివాసాల్లో, రోడ్డుపై పోతున్న వాహనాల డ్రైవర్లను, ప్రయాణికులను, కాలినడకన వెళ్తున్న వారిని సంప్రదించి టీకాలు ఇవ్వడం మొదలు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు. తెలిసిన వారికి ఫోన్లు చేశారు. అన్నిటి కన్నా ముఖ్యంగా నోటి మాట ద్వారా కూడా పలువురికి సమాచారం చేరవేశారు. పేవ్‌మెంట్‌ మీద నడుస్తున్న ఓ వృద్ధ మహిళకు  తెల్లవారు ఝామున 3:45 గంటలకు చివరి టీకా డోసును కూడా ఇవ్వడంతో 1600  డోసుల్లో ఒక్కటి కూడా వృధా కాకుండా చూశామని సియాటెల్‌ యూనివర్సిటీలో ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆస్పత్రి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కెవిన్‌ బ్రూక్స్‌ తెలిపారు. అంతేకాకుండా ఆ రాత్రి తొలి డోసు తీసుకున్న వారందరికీ నియమిత సమయంలో రెండో డోసు కూడా లభిస్తుందని హామీ ఇవ్వడం మరో బోనస్‌!

ఐతే ఈ ఘటన పట్ల కూడా కొందరు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రమాదం అంచున ఇంత మంది ఉండగా.. నిరుపయోగమౌతాయన్న కారణంగా దొరికిన వారికి దొరికినట్టు టీకాలను పంపిణీ చేయటం పట్ల విమర్శలూ లేకపోలేదు. ఎంత ప్రణాళికా బద్ధంగా ఉన్నా వృధా అనివార్యమని.. దానిని వీలైనంత తగ్గించటమే తక్షణ కర్తవ్యమని పలువురు అంటున్నారు.

ఇవీ చదవండి..

కరోనా టీకా విషయంలో భారత్‌ రికార్డులు

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పల్స్‌ పోలియో



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని