ఆక్స్‌ఫర్డ్‌ టీకా సమర్థవంతమైనదే: WHO - oxford’s covid vaccine offers protection
close
Published : 10/02/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్స్‌ఫర్డ్‌ టీకా సమర్థవంతమైనదే: WHO

వాషింగ్టన్‌: ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ సమర్థవంతంగానే పనిచేస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ముఖ్యంగా తీవ్ర కేసులు, ఆసుపత్రిలో చేరిక, మరణాలను నివారించడంలో వ్యాక్సిన్‌ పనితీరు బాగా ఉందని తెలిపింది. అయితే, తీవ్ర అనారోగ్యాన్ని నివారించడంలో వ్యాక్సిన్‌ ప్రభావాన్ని పర్యవేక్షించడం చాలా కీలకమని అభిప్రాయపడింది. ఆక్స్‌ఫర్డ్‌ టీకా సమర్థత స్వల్పంగానే ఉందంటూ ఆఫ్రికా వంటి దేశాలు ప్రకటించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ ప్రకటన చేసింది.

కరోనా వ్యాక్సిన్‌ల సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా పలు అపోహలూ, అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ఆస్ట్రాజెనెకా అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగ ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరులో విజయం సాధించడంలో భాగంగా అంటువ్యాధులను నివారించడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడింది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ పనితీరుపై ప్రభావం చూపే మ్యుటేషన్లతో కొత్తరకం కరోనా వైరస్‌లు ఉద్భవించడాన్ని తగ్గించాలని డబ్ల్యూహెచ్‌ఓ నొక్కిచెప్పింది.

ఎటువంటి ఆందోళన లేదు: భారత్‌

భారత్‌లోనూ ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై ఎటువంటి అనుమానాలు ఆందోళన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఇప్పటికే భారీ ఎత్తున వినియోగిస్తున్నామని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పేర్కొన్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కోటి పది లక్షల డోసులకు అదనంగా మరో కోటి డోసులకు భారత ప్రభుత్వం ఆర్డరు చేసినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి డోసుకు రూ.200 చొప్పున సీరం ఇన్‌స్టిట్యూట్‌ అందిస్తోన్న విషయం తెలిసిందే.

భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీకి జే&జే ఆసక్తి..

వ్యాక్సిన్‌ తయారీ కేంద్రంగా పేరుగాంచిన భారత్‌లో ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌, స్పుత్నిక్‌ వంటి విదేశీ వ్యాక్సిన్‌లు తయారుచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జాన్సన్‌& జాన్సన్‌ అభివృద్ది చేసిన వ్యాక్సిన్‌ను ఇక్కడే ఉత్పత్తిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు జాన్సన్‌& జాన్సన్‌ సింగిల్‌ డోసు టీకా అభివృద్ధి చేసింది. అమెరికాలో వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కింద ఎఫ్‌డీఏ అనుమతి కోసం జాన్సన్‌& జాన్సన్‌ దరఖాస్తు చేసుకుంది.

ఇవీ చదవండి..
బ్రిటన్‌ స్ట్రెయిన్‌లో జన్యుమార్పులు
భారత్‌లో కరోనా..పదివేల దిగువకుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని